Saturday, 18 April 2026 05:37:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్.. భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 20 August 2025 09:32 PM Views : 753

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో వైన్స్ షాపు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గానూ లైసెన్సుదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటు కావల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అప్లికేషన్ రుసుము 3 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్‌గా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాల వారీగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 2025-2027 సంవత్సరానికి వైన్స్ షాప్ టెండర్ల కు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసింది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష రూపాయలు పెంచి రూ. 3 లక్షలు చేసింది. ఫిక్స్‌డ్ షాప్ టాక్స ఆధారంగా లాటరీ పద్దతిలో వైన్ షాపులను కేటయించనున్నారు. దరఖాస్తు దాఖలులో ఎలాంటి పరిమితులు లేవు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చు. లైసెన్స్ కాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు మాత్రమే నిర్ణయించారు. ఇకసారి మద్యం షాపు కేటాయింపుల్లో 30 రిజర్వేషన్లకు కేటాయించారు. గౌడ్స్ సామాజిక వర్గానికి 15 శాతం, షెడ్యూల్ కులాల సామాజిక వర్గాలనికి 10 శాతం, షెడ్యూల్ తెగల సమాజిక వర్గానికి 5 శాతం వైన్స్ షాపులను కేటాయించనున్నారు. టెండర్ల ప్రక్రియల్లో పాల్గొనేందుకు భాగస్వామ్య సంస్థలకు, కంపెనీలకు సైతం అవకాశం కల్పించారు. ఈసారి లైసెన్స్ ఫీజులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎంపికైన లైసెన్స్‌దారులు 6 స్లాబుల ద్వారా లైసెన్స్ ఫీజు చెల్లుకునేందుకు వీలు కల్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈసారి కూడా మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో మద్యం వ్యాపారం లాభాల పంటగా భావిస్తుంటారు. అందుకే.. ఏటికేడు ఈ వ్యాపారం వైపు చొరవ చూపేవారి సంఖ్య పెరుగుతోంది. కాగా, వైన్స్ షాపు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన తుది తేదీలను ప్రకటించాల్సి ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :