Saturday, 13 June 2026 11:20:25 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

విద్యార్థుల పురోగతియే మా ధ్యేయం ప్రిన్సిపాల్ ఎన్ నరేంద్ర

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 26 September 2025 06:49 PM Views : 535

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 26/ అక్షరం న్యూస్/-----ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ చైతన్య ఆదేశాలతో చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ప్రిన్సిపాల్ నరేంద్ర అధ్యక్షతన పేరెంట్స్ కమిటీ మీటింగ్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు లెక్చరర్స్ కు మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చాలా ఘన చరిత్ర ఉంది. ఇటువంటి కళాశాల యందు పనిచేయడం చాలా గర్వకారణమని ఆయన అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న లెక్చరర్స్ ఇరవై మూపై సంవత్సరముల అనుభవం గలవారు. వారందరూ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ కళాశాలలోనే చదువుకొని ఇక్కడే అధ్యాపకులుగా పనిచేస్తూ కార్పొరేట్ కాలేజీలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. సుమారు 50 సంవత్సరముల చరిత్ర కలిగి ఎందరో విద్యార్థినీ విద్యార్థులను ఉన్నతమైన స్థాయిలో ఉంచినటువంటి మారుమూల జూనియర్ కళాశాల యందు పనిచేయడం గర్వంగా ఉందన్నారు. అంతటి చరిత్ర కలిగిన కాలేజీ యందు మీ పిల్లలను చేర్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వెయ్యాలని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. కమిషనర్ ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లేనటువంటి సౌకర్యాలు మన కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధునాతన సౌకర్యాలతో కంప్యూటర్స్ ల్యాబ్ లైబ్రేరియన్ వంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ కాలేజీలకు భిన్నంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు గత సంవత్సరం అత్యధిక రిజల్ట్ ను సాధించడం జరిగిందన్నారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఎందరో ఉన్నారు. అటువంటి ఘనకీర్తి కలిగిన చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు తమ పిల్లలను చేర్పించాలని ఆయన అన్నారు. ఇకనుంచి ప్రతి నెల పేరెంట్స్ కమిటీ మీటింగ్ ను నిర్వహించి కళాశాల పురోగతికి తమ వంతు తోడ్పాటు మరియు సూచనలు సలహాలతో కళాశాల పురోభివృద్ధికి తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేస్తామని ప్రిన్సిపాల్ నరేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో కారం కృష్ణమోహన్ అమృత రావు శేట్టి ప్రసాదు కృష్ణ సమ్మయ్య వెంకన్న భద్రం కొండలరావు గంగరాజు మరియు కార్యనిర్వహణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :