GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జనవరి-08(అక్షరం న్యూస్) ఉన్న ఊరిలో బతకలేక.. సరైన కూలి, ఉపాధి లేక ఆర్జన కోసం విదేశాలకు వలస వెళ్లిన వారు అక్కడ మరణిస్తే ఇక్కడ వారి కుటుంబం బాధ వర్ణనాతీతమే.. తండ్రి వస్తాడని పిల్లలు, భర్త వస్తాడని భార్య, కొడుకు వస్తాడని తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఉన్న ఊరిలో ఉపాధి దొరకక, బతకడం భారమై విదేశాలకు వెళ్లి కూలీ, నాలీ చేస్తూ జీవించేందుకు ఎంతో మంది విదేశీ బాట పడుతున్నారు.అక్కడ సరైన పని దొరకక, ఇబ్బందులు పడుతూ ఇక్కడి వారికి కష్టం చెప్పుకోలేక బాధపడుతున్నారు. అక్కడ సరైన పని లేక వెంట తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో మరింత ఆర్థిక సమస్యల్లో కుంగిపోతున్న మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలా మానసిక సమస్యలు శారీరక రుగ్మతలకు కూడా దారి తీస్తున్నాయి. దీంతో అక్కడే కన్ను మూస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన పిట్ల దేవరాజు (52)గత ఐదు సంవత్సరాల క్రితం బహ్రెయిన్ దేశం బ్రతుకు దెరువు కోసం వలస వెళ్ళాడు పనిచేసుకుంటు బ్రతుకు వెళ్ళదిస్తున్న క్రమంలో దేవరాజు పని చేసే కంపెనీ నుండి దేవరాజు గురు వారం ఉదయం బాత్రూం లో చనిపోయినట్లు తెలియచేయడం తో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాధిత కుటుంబ పరిస్థితిని గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల ఎన్ ఆర్ ఐ జిల్లా అధ్యక్షులు తోట దర్మేందర్ లు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం అతనికి భార్య స్వప్న, ఇద్దరు కొడుకులు ఉన్నారు మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకున్నారు.
.
Aksharam Telugu Daily