D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/వైరా /అక్టోబర్/24 (అక్షరంన్యూస్) ఏన్కూరు: పరాయి వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని కళ్ళతో చూసిన భర్త తట్టుకోలేక ఆగ్రహించి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని కాలనీ నాచారం గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. కల్లూరు రూరల్ సీఐ ముత్తిలింగం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కాలనీ నాచారం గ్రామానికి చెందిన తాటి రామారావు, గోవర్శినికి గత కొన్ని సంవత్సరాలు క్రితం పెళ్లయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత సంవత్సర కాలంగా గోవర్షిని అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ కలిసి గత ఆరు నెలల క్రితం విజయవాడ వెళ్లి సహజీవనం సాగించారు. ఈ విషయం గ్రామంలో తెలవడంతో భర్త రామారావు బంధువులు గోవర్శిని పిలిపించి పంచాయతీ చేశారు. అయినప్పటికీ వినకుండా ఆమె మరలా అఖిల్ ని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ నేపద్యంలో గత మూడు రోజుల క్రితం గోవర్షిని ఆళ్లపల్లి దగ్గర కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న తన కూతుర్ని చూసేందుకు వెళ్ళింది. విషయం తెలుసుకున్న భర్త రామారావు హాస్టల్ వద్దకు వెళ్లి భార్య గోవర్సిని తీసుకొని తన ఇంటికి కాలనీ నాచారం వచ్చాడు. భార్యతో మనిద్దరం మంచిగా ఉందామని అతను చెప్పడంతో గోవర్సీని నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త రామారావు నిద్రిస్తున్న సమయంలో గోవర్సీని గొడ్డలితో నరికి చంపాడు. గోవర్షిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విషయం తెలుసుకున్న ఏంకూరి ఎస్సై సంధ్య తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
.
Aksharam Telugu Daily