D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ/సెప్టెంబర్ 4 (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలోని కేశ్వాపురం, బిల్లుపాడు, వెంకటాపురం గ్రామాలలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ , సొసైటీ డైరెక్టర్ గోవింద శ్రీను సందర్శించారు.ఈ సందర్భంగా వారు గణనాథుడు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట సాదం రమేష్, చిన్నంశెట్టి శ్రీనివాసరావు, రావూరి ఇజ్రాయిల్, కట్టా వెంకటనారాయణ, చావా నాగేశ్వరరావు, భక్తులందరూ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily