Saturday, 18 April 2026 04:24:01 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఉద్యోగం పేరుతో మోసం చేసిన సీపీఐ నాయకుడి పై చీటింగ్ కేసు నమోదు

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 19 September 2025 10:36 AM Views : 443

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : . హుస్నాబాద్/సిద్దిపేట (అక్షరం న్యూస్) సెప్టెంబర్ 18 కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా,తన తల్లి గారి ఇంటి వద్ద ఉంటున్న మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తి పై హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..హుస్నాబాద్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వివాహిత మహిళ కుటుంబ కలహాలతో భర్తకు దూరమై తల్లిదండ్రులకు భారంగా ఉండలేక ఉపాధి కోసం వెతుక్కుంటుంటే తన అవసరాన్ని ఆసరాగా చేసుకున్న హుస్నాబాద్ కు చెందిన నిందితుడు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గడిపె మల్లేష్ నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఇరవై వేలు అడగగా నమ్మిన బాదిత మహిళ రూ 15 వేలు ఇచ్చిందని అయితే డబ్బులు తీసుకున్న కొద్ది రోజులు పని ఐపోతుంది అని నమ్మబలికి, గత సంవత్సరం నుండి అసలు ఫోన్ స్పందించక పోగా కనిపిస్తే చూసి చూడనట్లు వెల్లిపోతున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..గడిపే మల్లేష్ గతంలో కూడా నిజాయితీ పరుడైన ప్రభుత్వ ఉద్యోగిని డబ్బుల కోసం వేధిస్తే ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆ బాధ భరించలేక 2 ఏళ్ల సర్వీస్ ను వదులుకుని రిటైర్మెంట్ తీసుకున్నడని,సీపీఐ పార్టీకి చెందిన ఒక జాతీయ నేత తన వెనక ఉన్నడన్న అండతో అనేక అక్రమాలకు,బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని,తను చెప్పినట్లు వినకుంటే ఉద్యోగం తీపిస్తానని ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండేంట్ పై పలుమార్లు నీరాధారామైన ఆరోపణలు చేశాడని,హుస్నాబాద్ పట్టణంలో ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటుంటే నిబంధనలు పాటించడం లేదని మున్సిపల్ అధికారులకు పిర్యాదులు చేసి స్టేట్మెంట్ లు ఇచ్చి మళ్ళీ వారితో సెటిల్మెంట్లు చేసుకుని డబ్బులు వసూలు చేసేవాడని,పేద ప్రజలు ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లు కట్టుకుంటే తన అనుచరులతో దౌర్జన్యంగా నిర్మాణాల దగ్గరికి వెళ్లి అడ్డంకులు సృష్టించాడని,గడిపే మల్లేష్ పై ఫిర్యాదు చేసే బాధితులు జాతీయ నేత దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్న కూడా ఎలాంటి ప్రయోజనం లేదని,గడిపే మల్లేష్ తీరు వల్ల పార్టీ నష్టపోతుందని పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు బాధపడుతున్నట్టు తెలుస్తోంది.. ఆయన బాధితులు ఇంకా ఉన్నారని,ప్రజల కోసం పని చేసే సీపీఐ నాయకుడు ప్రజలను ఇబ్బంది పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..ఇదంతా జరుగుతున్న కూడా సీపీఐ పార్టీ నుండి ఎలాంటి స్పందన ఉంటుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :