P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జనవరి09 (అక్షరం న్యూస్) ఓదెల మండలం లోని పెద్ద కొమిర గ్రామంలో ఇటీవల మరణించిన సిరిసిల్ల బెటాలియన్ కానిస్టేబుల్ శివాజీ ముదిరాజ్ స్మారక అర్థం కాల్వ శ్రీరాంపూర్ ఓదెల రెండు మండలాల సెటిల్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఎసిపి గజ్జి కృష్ణ యాదవ్ మరియు సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ మనిషి ఆత్మహత్య పరిష్కారం కాదని గుర్తించాలి పోలీస్ అంటే ఒక ధైర్యం పోలీస్ అంటే ఒక నమ్మకం అలాంటి పోలీస్ అయి ఉండి ఇలాంటి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శివాజీ కుటుంబ సభ్యులకు పోలీసు వారి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ వారికి ఎప్పటికీ అండగా ఉంటామని మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా శివాజీ చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించి అకాల మరణం చెందడం బాధాకరం తనకు రెండేళ్ల కుమారుడు చూసి ఎంతో బాధ అనిపించిందని ఈరోజు శివాజీ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం శివాజీ మా కుటుంబా సభ్యుడు మా పోలీస్ అని తన కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు మా వంతు తప్పకుండా అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ముఖ్యంగా గ్రామంలో ఉన్న యూత్ యూత్ అంటే 30 35 సంవత్సరాలు వైసె కాదు 55 సంవత్సరాల వరకు కూడా యువత అని భారతదేశ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం మనిషి 55 సంవత్సరాల వరకు యూత్ అని ఇప్పుడున్న పరిస్థితులలో మెడికల్ సదుపాయం పెరిగిందని దాని ప్రకారం 55 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తి యువతనని మనిషి పుట్టుక సామాన్యమైనది కాదని దేవుళ్ళు ఎలా ఉంటారో తెలవదు మనకు కనపడరు మనము మనిషై పుట్టిన తర్వాత అందరికీ కనబడుతం కష్టసుఖాలు ఉంటాయి ఎన్నో బాధలు వస్తాయి అన్నిటినీ తట్టుకొని నిలబడాలి అంతేతప్ప ఆత్మహత్య పరిష్కారం కాదని బాధలుంటే చెప్పుకోవాలి స్నేహితుల తోటి పంచుకోవాలి మాలాంటి వాళ్లకు చెప్పుకోవాలి అప్పుడే ఏదైనా పరిష్కారం దొరుకుతది అంతే తప్ప ఆత్మహత్య పరిష్కారం కాదని తన మృతితో ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని ముఖ్యంగా యువకులు మద్యం మత్తు పానీయాలు గంజాయి దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి స్థానిక ఎస్ఐ ది కొండ రమేష్ సర్పంచ్ గోలి లింగారెడ్డి ఉపసర్పంచ్ మూల సంపత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి తోపాటు మృతుడి శివాజీ కుటుంబ సభ్యులు భార్య తేజస్వి కుమారుడు రుక్విత్ మృతుడి అన్నలు కుమార్ శ్యామల శ్రీనివాస్ రమ్య మరియు అక్కలు శారద రాజయ్య సమ్మక్క శ్రీనివాస్ మల్లేశ్వరి మరియు సెటిల్ టోర్నమెంట్ యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily