DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : దొమ్మటి రాజేష్ అక్షరం ప్రతినిధి పెద్దపల్లి; ఈ ఏడాది కరెక్ట్ సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే పంటలకు అత్యంత అవసరమైన యూరియా ఎరువు కొరత ఏర్పడింది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మధ్యమ కాలములోకి వచ్చిన ఇంకా అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు నా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది పెద్ద రైతులు ముందస్తుగా యూరియా కొనుగోలు చేసి నిలువ చేసుకోవడంతో ఈ కొరత మరింత ఎక్కువగా మారింది. ఈ నేపథ్యంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎరువుల వ్యాపారులు అందిన కాడికి దోచుకుంటున్నారు అనే ఆరోపణలు వినవస్తున్నాయి. అధిక ధరలకు విక్రయించడంతోపాటు ఇతర ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేస్తేనే యూరియా బస్తాలు ఇస్తామని చెబుతుండడంతో అవసరం లేకపోయినా రైతులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి కల్పిస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. యూరియా కోసం పడి కాపులు.... మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే యూరియా ప్రస్తుతం కొరత ఏర్పడడంతో రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతూ రోజుల తరబడి పడి కాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో గంటల తరబడి క్యూలైన్లో నిలబడిన ఎరువు బస్తా దొరకడం గగనంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొదట వ్యవసాయ సహకార సంఘాలు డీసీఎంఎస్ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలకు యూరియా పంపించి రైతులకు అందించే ఏర్పాట్లను అధికారు యంత్రాంగం చేపట్టింది. ఇటీవల ఎరువుల దుకాణాలకు కూడా యూరియా సరఫరా చేస్తున్నారు. అయితే ఎరువుల దుకాణాల యజమానులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని యూరియా కోసం వచ్చే రైతులను తమ వద్ద ఉన్న ఇతర ఎరువులు క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కొంతమంది రైతులు అవసరం లేకపోయినా కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అయితే యూరియా ఎరువు బస్తా 266 50 పైసలు ఉండగా మార్కెట్లో 330 నుండి 350 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అలాగే నానో యూరియా అర లీటర్ బాటిల్ 150 రూపాయలకే విక్రయించాలని జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్ష స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ 200 నుండి 225 రూపాయల వరకు అమ్మకాలు చేపడుతున్నారు. అయితే వీటి నియంత్రించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతుల నుండి అందిన కాటుకు దోచుకుంటున్నారని ఆరోపణ వినవస్తున్నాయి. డీఏపీ కొంటేనే యూరియా ఇస్తామంటున్నారు.. ... గుడాల శ్రావణ్, రైతు దస్తగిరి పల్లె తమకు రెండు యూరియా బస్సులు అవసరం ఉండి వద్దంట పెద్దపల్లి పట్టణంలో తిరుగుతున్నానని ప్రస్తుతం ఇక్కడ శ్రీ లక్ష్మీ ఎరువుల దుకాణంలో యూరియా ఉందని వస్తే తమ వద్ద ఉన్న డి ఏ పి లీటర్ బాటిల్ కొనుగోలు చేస్తేనే ఇస్తామని చెబుతున్నారని మండలంలోని దస్తగిరి పల్లి గ్రామానికి చెందిన గుడాల శ్రావణ్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిన్న సన్నకారు రైతునని తనకు అవసరమున్న యూరియా కాకుండా వేరేది కొనుగోలు చేసే అవకాశం కూడా లేదని ఇప్పుడు తన పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏ ఎరువుల దుకాణం కి వెళ్ళిన ఏదో ఒక లింక్ పెడుతూ యూరియా అమ్మకాలు చేపడుతున్నారని ఆయన తెలిపారు అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యాపారులతో అధికారులకు కుమ్మక్కు.. ... బిజెపి నాయకుడు శ్రీనివాసరావు యూరియా కొరత నేపథ్యంలో అవసరమైన రైతులకు సక్రమంగా ఎరువుల సరఫరా చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బిజెపి నాయకుడు ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. యూరియా అమ్మకాల సందర్భంగా రైతులను ఇష్టానుసారం వ్యాపారులు దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఈ విషయంలో వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. యూరియా కొరత నివారణకు తగిన చర్యలు చేపట్టాలని చిన్న సన్న కారు రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్ద రైతుల వద్ద యూరియా నిల్వల వల్లే ఈ సమస్య ... జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లాకు 30 వేల మెట్రిక్ టన్నుల యూరి అవసరముండగా ఇప్పటివరకు 26, 550 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెలాఖరు వరకు 3450 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని ఆయన పేర్కొన్నారు. యూరియా అమ్మకాలపై వ్యాపారులు చేస్తున్న అంశమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసులు అక్షరం ప్రతినిధి వివరణ కోరగా ఆయన ఈ విధంగా స్పందించారు. అయితే ఇప్పటికే పెద్ద రైతుల వద్ద యూరియా నిల్వలు ఉండటం వల్ల కొరత ఏర్పడిందని ఆయన తెలిపారు. యూరియా ఆధార్ కార్డు ఆధారంగా పంపిణీ చేయడం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమైందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చిన్న సన్న కారు రైతులకు ఎలాంటి లింకు పెట్టకుండా ఎరువు బస్తాలు ఇవ్వాలని ఆయన వ్యాపారులను ఆదేశించారు.
.
Aksharam Telugu Daily