GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : . సుల్తానాబాద్, (పెద్దపల్లి జిల్లా) అక్టోబర్ 29, అక్షరం న్యూస్. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శివారులోని ఒక రైస్ మిల్లు లో బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బైలర్ పేలి పెను మాదం జరిగింది . ఇందులో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా గమనించిన యజమాన్యం హుటాహుటిన గాయపడ్డ వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి కనక దుర్గ రైస్ మిల్లులో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.కళ్ళు మూసి తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదవశాత్తు రైస్ మిల్లు బైలర్ పేలింది. ఈ ప్రమాదంలో రెండు గోదాములతో పాటు మిషనర్స్, వరి ధాన్యం, బియ్యం తదితర దెబ్బతిని నష్టం వాటిల్లింది. దాదాపుగా రెండు కోట్ల వరకు నష్టం వాటిల్ని ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైస్ మిల్లు పూర్తిగా ధ్వంసం అయింది.
.
Aksharam Telugu Daily