Saturday, 13 June 2026 09:57:35 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వరలక్ష్మి బిర్యాని సెంటర్ బయటకి కనబడుతుంది* *లోపల బార్ అండ్ రెస్టారెంట్ కు మించి మద్యం సిట్టింగ్*

అధికారులకు తెలిసే జరుగుతుందా? తెలియకుండా జరుగుతుందా?


SOUDAMALLA. YOHAN

Reporter

Date : 11 November 2025 04:43 PM Views : 381

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : * కరీంనగర్/జమ్మికుంట/నవంబర్ 11/అక్షరం న్యూస్: జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు సమీపంలో గల వరలక్ష్మి బిర్యాని సెంటర్ పేరుకు మాత్రమే బిర్యాని సెంటర్ గా లోపట మాత్రం బార్లను మరిపించే విధంగా సెట్టింగ్ చేసి హోటల్ యజమాని నడిపిస్తున్న గాని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. అధికారులకు తెలిసే జరుగుతుందా? లేక తెలియదా? పట్టణ ఒడ్డున బార్లను తలపించేలాగా బిర్యానీ సెంటర్ నడిపిస్తున్న కానీ స్థానిక మున్సిపాలిటీ అధికారులు కానీ ఎక్సైజ్ సిబ్బంది గానీ ఎందుకు పట్టించుకోవడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు. వరలక్ష్మి బిర్యాని సెంటర్లో చికెన్ ఫ్రై ధర 480 రూపాయలు ఈ ధర బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా లేదని పలువురు చర్చించుకుంటున్నారు. లోపటికి వెళ్తే ఎలాంటి పరిశుభ్రత లేకుండా అశుభ్రత వాతావరణం లో హోటల్ను బార్ లాగా నడిపిస్తున్న కానీ అధికారులు ఎందుకు చూసి చూడనట్టు వివరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా వరలక్ష్మి బిర్యానీ సెంటర్ పైన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, స్థానిక ఎక్సైజ్ అధికారులు, మున్సిపాలిటీ అధికారి ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :