Saturday, 18 April 2026 04:22:38 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించండి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరావు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 13 September 2025 09:01 PM Views : 504

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 13/ అక్షరం న్యూస్/----స్థానిక సిపిఐ కార్యాలయం నందు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఈ నెల 11 నుంచి 17 వరకు వాడవాడలా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు తొత్తులుగా ఉన్న పటేల్ పట్వారి జమీందారులను తరిమికొట్టిన కమ్యూనిస్టు గెరిల్లాలకు జోహార్లు మీ స్ఫూర్తిని నేటి యువతరానికి అందిస్తాం అన్నారు. 1948 సెప్టెంబర్ 17 న కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిందన్నారు. భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణలుగా చూపే మతోన్మాద కుట్రలను తిప్పి కోడదంమన్నారు. పటేల్ చీకటి ఒప్పందం ఫలితమే నిజాం రాజుకు గవర్నర్ పదవి తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నే నిజాం నిరంకుశ పాలన రద్దయింది తప్ప పటేల్ సైనిక చర్యల వల్ల కాదు అన్నారు. సాయుధ పోరాటంలో 4,000 మంది యువకిశోరాలు చనిపోయినారని 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర సిపిఐ పార్టీ దన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని అప్పుడే వారికి ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ సిపిఐ మండల కార్యదర్శి నూప పోతయ్య సీనియర్ నాయకులు నూక తిరుపతిరావు పాల్వంచ రామారావు సహాయ కార్యదర్శులు కోటి ముత్యాలరావు చల్లా లక్ష్మీనారాయణ పాలెం సత్యనారాయణ కోడి రెక్కల రాజారావు కొవ్వాసి దేవయ్య భీమయ్య మడకం నందయ్య మురళి గుండె సమ్మయ్య నూప రాము డబ్బా శంకర్ గుండి శ్రీను మడకం కమలేష్ మడకం సోమయ్య చుక్కయ్య పోశయ్య దేవి మంగమ్మ నరసమ్మ అనసూర్య జోడి రామయ్య దీపక్ మహేష్ ముత్తయ్య తోట శ్రీను. తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :