D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/ నవంబర్/ 17 (అక్షరంన్యూస్) వైరా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల నుంచి 20 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు నూతనంగా పార్టీలో చేరిన వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు అశోక్, చెన్న ఎల్లారావు, వేముల రామ్ చరణ్, బత్తుల నాగరాజు, పెద్ది గోపి, వడ్లమూడి సుజేష్ లక్ష్మణ్, తమ్మిశెట్టి దుర్గారావు తదితరులు పార్టీలో సభ్యత్వం పొందారు. నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ... బిజెపి చేపడుతున్న ప్రజా పాలన, అభివృద్ధి విధానాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. వైరా నియోజకవర్గం అభివృద్ధికి బిజెపి మాత్రమే కట్టుబడి పనిచేస్తుందనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు బండారు నరేష్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily