Saturday, 18 April 2026 04:20:04 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

డిసెంబర్ చివరి నాటికి అంగన్వాడీ కేంద్రాలు, జిపి బిల్డింగ్స్ పూర్తి.. సాచురేషన్ పద్దతిలో అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతుల కల్పన.. *జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 September 2025 07:22 PM Views : 501

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 (అక్షరంన్యూస్) జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్ , ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపాలిటీ, వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావడం చాలా కీలకమని, పనులు ఆలస్యం కావడం వల్ల నిర్మాణ ఖర్చులు పెరిగి ప్రభుత్వంపై భారం పడుతుందని కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి పనులపై క్షేత్ర స్థాయిలో చిన్న, చిన్న సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. జిల్లాకు మంజూరైన 41 అంగన్వాడీ కేంద్రాల్లో 40, 101 గ్రామ పంచాయతీ భవనాల్లో 70 నిర్మాణంలో ఉన్నాయని, 30 జిపి బిల్డింగ్స్, 1 అంగన్వాడీ కేంద్రం నిర్మాణం పూర్తయిందని, పెండింగ్ పనులు వేగవంతం చేస్తూ డిసెంబర్ చివరి నాటికి జిపి బిల్డింగ్స్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 11 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ లలో 5 పూర్తి చేశామని, 4 నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని, ఫైల్ క్లియర్ చేసి త్వరగా టెండర్లు పిలవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మేర టాయిలెట్స్ నిర్మాణ పనులు ఉపాధి హామీ క్రింద ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రస్తుతం సొంత భవనాలలో ఉన్న 940 అంగన్వాడి కేంద్రాలలో త్రాగు నీటి సరఫరా, టాయిలెట్ బ్లాక్స్ మొదలగు మౌళిక వసతుల కల్పన పనులు ఈ.జి.ఎస్. ద్వారా సాచురేషన్ పద్దతిలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. రఘునాథపాలెం మండలంలో మంజూరైన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, అక్కడ విద్యుత్ స్తంభాలు, లైన్స్ తరలింపు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మధిర, పాలేరు మొదలగు ప్రాంతాలలో వర్కింగ్ ఉమెన్ హస్టల్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ప్రతిపాదనలు అందించాలని అన్నారు. ఖమ్మం నగరం పరిధిలో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్వహణ, మరమ్మత్తు పనులు కార్పోరేషన్ చేపట్టాలని అన్నారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో చాలా కాలం నుంచి పనులు గ్రౌండ్ కాకుండా ఉన్న వాటిని రద్దు చేయాలని అన్నారు. ఆర్ అండ్ బి శాఖ పెండింగ్ పనులపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ అభివృద్ధి పనులపై అసిస్టెంట్ ఇంజనీర్లతో రెగ్యులర్ గా సమీక్ష నిర్వహించాలని, పనులు వేగవంతంగా జరిగితే సంబంధిత మంత్రులను సంప్రదించి బిల్లుల చెల్లింపులు పూర్తి అయ్యేలా కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. 50 సబ్ సెంటర్ పనుల్లో 38 పూర్తి చేశామని, వచ్చే నెల రోజుల వ్యవధిలో పెండింగ్ 12 సబ్ సెంటర్ పనులు పూర్తి చేసి వైద్య శాఖకు అప్పగించాలని అన్నారు. సిడిపి, ఎస్.డి.ఎఫ్, ఎంపి ల్యాడ్స్ క్రింద గతంలో మంజూరు చేసి గ్రౌండ్ కాని పనులను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 80 శాతం పూర్తయిన అభివృద్ది పనులపై దృష్టి పెట్టి త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. అభివృద్ది పనుల బిల్లులు సమర్పించే సమయంలో ఇసుక చలాన్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఎం.ఐ.డి.సి. క్రింద చేపట్టిన ఖమ్మం జనరల్ ఆసుపత్రి టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. క్రింద చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేశారు. టేకులపల్లి డైట్ కాలేజీ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని, వీటికి అవసరమైన సవరణ అంచనా ఆమోదింపచేసుకొని మార్చి 2026 నాటికి పనులు పూర్తి కావాలని అన్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి అక్టోబర్ తర్వాత చెక్ డ్యాం పనులు ప్రారంభించాలని అన్నారు. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ సర్వే త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి జీపి బిల్డింగ్స్ భూ సమస్య ఉన్నట్లయితే అక్కడ రద్దు చేసి మరో చోట ప్రతిపాదనలు అందించాలని అన్నారు. రఘునాథ పాలెం మండలంలో చేపట్టిన ఎస్టి హస్టల్ 90 శాతం పూర్తయిందని, వీటి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఓ ఏ. శ్రీనివాస్, డిఆర్డీవో సన్యాసయ్య, డిడబ్ల్యుఓ రాంగోపాల్ రెడ్డి, ఎస్ఇ లు యాకోబు, వెంకట్ రెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి., ఇరిగేషన్, మునిసిపల్, మిషన్ భగీరథ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :