DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి మార్చి 17 అక్షరం న్యూస్; పెద్దపల్లి జిల్లా పరిధిలోని బసంత్ నగర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాదులో చదువుకుంటున్న తమ కుమార్తె రుషితను చూడటానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బసంత్ నగర్ సమీపంలో వారి కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఢీకొన్న దెబ్బకు కారు తీవ్రంగా దెబ్బతినడంతో దంపతులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు
.
Aksharam Telugu Daily