Monday, 15 June 2026 02:24:52 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజా ప్రతినిధులకు రెండు పెన్షన్లు..

తెలంగాణలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అటు పెన్షన్లు ఇటు జిపిఎఫ్ నిలిపివేత బాధాకరం.. ఈ మనోవేదనతో రాష్ట్రవ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య.. ఇదెక్కడి పాలనా ? దేశంలో ఎక్కడా లేదు.. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 12 September 2025 05:28 PM Views : 490

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) శుక్రవారం నాడు కుక్క సత్యం అధ్యక్షతన ఎన్ఎస్పి క్వార్టర్స్ లో తెలంగాణ ఉద్యమకారుల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది . ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య పాల్గొని మాట్లాడుతూ తమ జీవితంలో విలువైన  సమయాన్ని  ఉద్యోగరీత్యా ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసేందుకు  వినియోగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం చలించడం లేదని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ... ఈ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు. తమ జీవిత చరమాంకంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తమ వేతనల నుండి దాచుకున్న జిపిఎఫ్ సొమ్మును కానీ, పెన్షన్ సొమ్మును గానీ గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ పాలకులు ఇవ్వడం లేదని బత్తుల సోమయ్య మండిపడ్డారు. రకరకాల అవసరాల నిమిత్తం ఉద్యోగ ప్రస్థానంలో తీసుకున్న వివిధ రుణాలకు సంబంధించిన డబ్బులు ప్రస్తుతం ఈఎంఐ రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ విధమైన పరిస్థితుల నేపథ్యంలో అటు జిపిఎఫ్ ఇటు పెన్షన్లు రాక పదవీ విరమణ చెందిన ఉద్యోగులు ఇంటి నిర్మాణాల కోసం తీసుకున్న బ్యాంకు రుణాలు, వ్యక్తిగత లోన్లు, పిల్లల చదువుల కోసం తీసుకున్న రుణాలు, పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు చెల్లించలేక, వారి ఒత్తిళ్లు భరించలేక కొంత మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బత్తుల సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. వాటి నుండి విముక్తి పొందడానికి మందులకైనా ఆపరేషన్ లకైన జిపిఎఫ్ డబ్బులో నుండి చెల్లిస్తేనే కదా వారు విముక్తి పొందేది. జీవితకాలం శ్రమపడి కూడా పెట్టుకున్న సొమ్మును ఆపదకు, అవసరానికి ఇవ్వరు . రావలసిన సొమ్ము నాకు నా పిల్లలకు ఉపయోగపడలేదని, మనోవేదనతో చనిపోయిన తర్వాత ఎవరికి ఇస్తారు.., సీఎం గారు ఆత్మ పరిశీలన చేసుకోండని అన్నారు. ప్రపంచ చరిత్రలో తెలంగాణ అమరవీరుల ఆత్మబలి దానాలు, ఉద్యమకారుల త్యాగాలు మరువలేనివి. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్న ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తూ..., కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అసలు వారి త్యాగాలను గుర్తించకపోవడాన్ని భరించలేక అమరవీరుల ఆత్మలు కూడా ఘోషిస్తున్నాయి. పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన ఉద్యమకారుల ఆశలను వమ్ము చేసింది. కాంగ్రెస్ పార్టీ అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను ఆదుకుంటామని హామీలు గుప్పించింది.., దీన్ని నమ్మిన ఉద్యమకారులు మూకుమ్మడిగా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా కృషి చేశారు. కానీ రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఉద్యమకారుల ఊసే ఎత్తకుండా.., వారి సామ్రాజ్యాలను విస్తృత పరుచుకుంటున్నారు. దీనిలో భాగంగానే వారి ఆర్థిక స్వలాభాల కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో, మూసి సుందరి కరణ పేరుతో, రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో, అందాల పోటీల పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి.., ప్రజాధనాన్ని ఆగం చేస్తున్నారని ఆరోపించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని, భగభగ మండుతున్న మంటలో మాడి రాష్ట్రాన్ని సాధించిన వారికి కానీ, 30 - 40 సంవత్సరాలపాటు ప్రభుత్వానికి, సమాజానికి సేవలు అందించి, పదవీ విరమణ చేసిన పెన్షన్దారులకు వారు దాచుకున్న సొమ్మును, పెన్షన్ను ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్లో నుండి కొంతైనా కేటాయించలేరా అని ప్రశ్నించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇటు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేంతవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని సోమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు పాలకుర్తి కృష్ణ , అంబాల రామారావు, తునికి పాటి చారి, కుక్క సత్యం, జంపాని అంజయ్య, బోలికొండ పాపయ్య, చాగంటి ప్రసాద్, అంగిడి బిక్షం, షేక్ ఫక్రుద్దీన్, కాలింగ్ గురవయ్య, భువనగిరి నరసింహారావు, కుర్రి ముత్తయ్య, ఉల్లోజు వెంకన్న, రాయగూడెం వెంకటేశ్వర్లు, నేలపట్ల వీరబాబు, టి గోవిందు, రామ్మూర్తి, మంగీలాల్, జయమ్మ, రాజేష్ నాయక్, వడ్డే బోయిన వెంకటేశ్వర్లు, కొత్త వెంకటరెడ్డి, ఉల్లంగి పద్మ, శ్రీలక్ష్మి, బత్తుల సుమతి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :