D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ డిసెంబర్ 5 వైరా (అక్షరం న్యూస్) నేరేడ గ్రామంలో వైరా లైన్స్ క్లబ్, లయన్ కంటి ఐ. హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం కంటి వైద్యులు డాక్టర్ జి. రవిచంద్ర ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 150 మందికి కంటి పరీక్ష నిర్వహించి, 28 మందికి కంటి ఆపరేషన్స్ గుర్తించారు. ఈ సందర్భంగా నేరేడగ్రామ సర్పంచ్ దూసరి నేతాజీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు లయన్ కంటి ఆసుపత్రి చేస్తున్న సేవలను అభినందించారు. లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లయన్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు ఉండ్రు శ్యాంబాబు, డాక్టర్ రవిచంద్ర కంటి ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు, లైన్స్ క్లబ్ నిర్వాహకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily