D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 (అక్షరం న్యూస్) ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా మాసోత్సవాలు సందర్భంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుండి కొత్త మున్సిపాలిటీ వరకు పాదయాత్రగా వెళ్తూ వాహనదారులకు నినాదాలు ఇస్తూ ప్రజలకు హెల్మెట్ ధరించి, సీటు బెల్టు పెట్టుకోవాలని ,మైనర్లకి వాహనాలు ఇవ్వరాదని, అతివేగంగా వాహనాలు నడప రాదని ర్యాలీ నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆర్టిఏ ఏవో సుధాకర్ ,స్టాఫ్ సీనియర్ అసిస్టెంట్ రత్నరాజు, సీతారాములు , విజయలక్ష్మి , కానిస్టేబుల్ రమేష్ , సరిత , ప్రసన్న, నీచాలా ,ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు జిల్లా ఉపేందర్ , కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ నాయకులు మస్తాన్, మధు , ట్రాక్టర్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు రాందాస్, ఆటో యూనియన్ నాయకులు లక్ష్మణ్ ,ఉపేందర్, భాస్కర్ నాయకులు పాల్గొన్నారు .
.
Aksharam Telugu Daily