Friday, 31 July 2026 04:55:12 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆపదలో ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్ వరం ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 July 2026 05:14 PM Views : 116

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూన్ 04 అక్షరం న్యూస్ ప్రజారోగ్యాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్ లో నియోజకవర్గంలోని లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు, పెద్దపల్లి మండలం, మున్సిపాలిటీ పరిదిలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులను విప్ విజయ రమణారావు శనివారం అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ రమణారావు మాట్లాడుతూ వైద్య, సంక్షేమ, అభివృద్ది రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ఆపదలో ఉన్న ఎందరికో సిఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సహాయం అందించామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అభివృద్ది, సంక్షేమం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందుందన్నారు. ప్రజల కోసం నిరంతరం పని చేసేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ అమలు చేస్తున్న ఘనత సిఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో పరుగులు పెట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తున్నారు వివరించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :