Friday, 31 July 2026 04:02:59 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పాలేరు నుండి ‘రైతు ఆశీర్వాద సభ’కు భారీగా తరలిరావాలి.. తుంబూరు దయాకర్ రెడ్డి

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 July 2026 07:23 PM Views : 175

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జూలై 9 (అక్షరం న్యూస్) ఖమ్మం :చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ఈ నెల 10న శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగానికి రూ. 9 వేల కోట్ల ‘రైతు భరోసా’ నిధులను జమ చేసిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ చారిత్రాత్మక సభకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి తో పాటు మన పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కావున మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి సూచనల మేరకు పాలేరు పరిధిలోని ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలు, ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామస్థాయిలో సమన్వయం చేసుకొని ప్రజలను, రైతులను భారీ సంఖ్యలో సభా వేదికకు తరలించి సభను జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :