Friday, 31 July 2026 04:02:57 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

దసరా నాటికీ ఆర్టీసీ బస్సుడిపో నిర్మాణం పెద్దపల్లి ప్రజల చిరకాల కల బస్సు డిపో నూతన బస్సు డిపోతో పెరగనున్న రవాణా సౌకర్యాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు..


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 30 July 2026 05:29 PM Views : 53

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 30 అక్షరం న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రజల చిరకాల కోరిక పెద్దపల్లి బస్ డిపో కల నెరవేరబోతుందని అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణ పనులను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి గురువారం రోజున ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న బస్సు డిపో పనులను తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి పరిశీలించడం జరిగింది అని దసరా వరకు పెద్దపల్లి బస్సు డిపో ప్రారంభించే దిశగా పనులు త్వరత్వరగా జరిగేల ఎం.డి అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు తెలిపారని అన్నారు. బస్సు డిపో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లల్లో బస్సు డిపో ఉన్నప్పటికీ మొదటి నుండి పెద్దపల్లి కూడా రెవేన్యూ డివిజన్ అయినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో డిపో లేకపోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దపల్లి ప్రజల ఆకాంక్ష అయిన బస్సు డిపో మంజూరు చేయమని వినతి పత్రం అందజేసిన తర్వాత వారు పెద్దపల్లి ప్రజలపై ఉన్న మమకారంతో వారు 2024 డిసెంబర్ మాసంలో పెద్దపల్లి ప్రాంతానికి విచ్చేసి యువ వికాసం బహిరంగ సభలో బస్సు డిపో మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పెద్దపల్లి బస్సు డిపోను దసరా వరకు పూర్తి చేస్తామని ఆర్టీసీ ఎండీ తెలిపారని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, ఆర్టీసీ అధికారులు, పట్టణ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :